Log In

 

Company Name : Vattikuti Technologies

Friday, August 18, 2017 2:15PM IST (8:45AM GMT)

రోబోటిక్ శస్త్రచికిత్స:క్యాన్సర్ వ్యాధిపై పోరాటంలో కొత్త ఆశ


శస్త్ర చికిత్స సమయంలో మానవహస్తం క్యాన్సర్ కణజాలంవద్దకు మరింత దగ్గరగా వెళ్ళేటట్లు చేయటానికి డావిన్సీ రోబోసర్జన్ కు ఎంతో ఉపయోగపడుతుంది


Visakhapatnam, Andhra Pradesh, India

క్యాన్సర్ ఒక క్రూరమైన వ్యాధి. అవయవాలను, కణజాలాన్ని దెబ్బతీసే ఈ వ్యాధి, మొదట్లో ఏమాత్రం పైకి కనపడకుండా శరీరంలో మారుమూలప్రాంతాలలో ప్రాణాంతక కణాలను, కణుతులను దాస్తుంది. మొదట్లోనే దీనిని కనిపెట్టటం ఒక పెద్ద సవాల్. అయితే బయటపడిన తర్వాత, రోగులు ఆ వ్యాధి సోకిన విషయాన్ని అంగీకరించలేక, ప్రత్యామ్నాయలను వెతకటంలో కాలాన్ని వృథా చేస్తారు. దీనితో శస్త్రచికిత్స, మందులు, రేడియో-కెమోథెరపీ కాంబినేషన్ తప్పనిసరి అవుతాయి. 

> <
  • AA da Vinci Surgical Robot mounted on vehicle in Andhra Pradesh
 
అయితే ఈ వ్యాధి యొక్క తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న రోగులకు ఒక ఆశాకిరణం గోచరిస్తోంది. దెబ్బతిన్న కణాలను పెద్దవిగా చూడటానికి, అతిసూక్ష్మ, సునిశిత పరికరాల ద్వారా శరీరం అంతరాంతరాలలో ఉన్న వ్యాధి కణాలవద్దకు చేరటానికి రోబోటిక్ సర్జరీ పద్ధతులవలన వీలు కలుగుతోంది… తద్వారా ఈ చికిత్సలో కొత్త పురోగమనం ఏర్పడింది.
 
రోబోటిక్ విధానం
 
కార్లు నుంచి పెయింటింగ్ వరకు, చెస్ ఆట దగ్గరనుంచి టేబుల్స్ వద్ద వెయిటింగ్ వరకు రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు చేరని రంగంగానీ, పనిగానీ లేవంటే అతిశయోక్తికాదు. అయితే రోబోటిక్ శస్త్రచికిత్స అదే శ్రేణిలోకి రాదని చెప్పాలి. డావిన్సీ రోబో అనేది సర్జన్ అవసరం లేకుండానే రోగికి తనంతట తానే శస్త్రచికిత్స చేయగలిగే యంత్రం కాదు. వాస్తవానికి, డావిన్సీ రోబో పక్కనే ప్రతి సెకను సమయంలోనూ సుశిక్షితుడైన సర్జన్ ఉంటారు.
 
సైన్స్ మరియు వైద్యం అనే రెండు రంగాలయొక్క అత్యుత్తమ కలయిక అయిన డావిన్సీ సర్జికల్ రోబో రెండువేల కిలోల బరువు ఉండే ఒక యంత్రం. దీనియొక్క మేధస్సు 24 పర్సనల్ కంప్యూటర్లకు సమానం. దీనిపై 2,250 కంటే ఎక్కువ పేటెంట్లు ఉన్నాయి… మరో 1,550 పేటెంట్లు పెండింగులోఉన్నాయి. ఈ రోబో మొత్తం అత్యాధునికతతో నిండి ఉంది. వాస్తవానికి ఈ రోబో ఏమి చేస్తుందంటే శస్త్రచికిత్స చేయవలసిన ప్రదేశాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది మరియు ఒక సూక్ష్మరంధ్రంద్వారా తన నాలుగు చేతులను లోపలికి చొప్పించి ఆ ప్రదేశంలో చేయవలసిన పనిని చక్కబెడుతుంది. అతితక్కువ కోతతో చేసే శస్త్రచికిత్సలు(మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ)లో ఇది ఒక గొప్ప ముందడుగు మాత్రమే కాకుండా ల్యాప్రోస్కోపిక్ విధానాలకన్నా ఎంతో మెరుగైనది.
 
డావిన్సీతో పనిచేసేటపుడు సర్జన్ ఒక కన్సోల్ దగ్గర కూర్చుంటారు. ఆ సర్జన్ తన స్పెషాలిటీలోని శస్త్రచికిత్సలు చేయటంలోనే కాక ఈ యంత్రాన్ని ఉపయోగించటంలోకూడా నిపుణుడై ఉంటారు. కన్సోల్ వద్దనుంచి ఆ సర్జన్ కు రోగి శరీరంలోని అంతర్భాగాలు 3డీ లోనే కాకుండా 10 రెట్లు పెద్దగా కనబడుతూ ఉంటాయి. సర్జన్ అక్కడనుంచే రోబో యొక్క చేతులను నియంత్రిస్తూ కణజాలాన్ని తొలగించటానికిగానీ, రిపేర్ చేయటానికిగానీ అవసరమైన సరైన పరికరాన్ని పంపుతూ ఉంటారు. ఈ రోబో ఎంతో సునిశితంగా పనిచేస్తూఉంటుంది కాబట్టి పొరపాట్లు జరిగే అవకాశాలు చాలా తక్కువ. రోబోటిక్ చేతులను లోపలికి పంపటానికి శరీరానికి చేసే కోతలు, గాట్లు చాలా చిన్నవి కాబట్టి మామూలుగా చేసే ఓపెన్ సర్జరీలలోలాగా రోగి బాధను అనుభవించాల్సిన అవసరం ఉండదు. ఇది ప్రతిఒక్కరికీ ఎంతో ఊరటనిస్తుంది. దీనివలన రక్తస్రావం చాలా తక్కువ, నొప్పి తక్కువ, త్వరగా కోలుకోగలుగుతారు, ఆసుపత్రిలో ఉండే కాలం కూడా తక్కువగా ఉంటుంది.
 
మృదువైన కణజాలానికి సంబంధించిన ప్రదేశాలలో ఈ రోబోటిక్ శస్త్రచికిత్స అత్యుత్తమంగా పనిచేస్తుంది. స్త్రీ జననావయవాల క్యాన్సర్, తల-మెడ మరియు థొరాసిక్ సర్జరీ, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, థైరాయిడ్, ప్రొస్టేట్, గర్భాశయం వంటి శరీరాంగాల తొలగింపు, మూత్రనాళ వ్యాధులు, ఇంకా అవయవ మార్పిడి వంటి కేసులలో కూడా సంప్రదాయ శస్త్రచికిత్సలకంటే రోబోటిక్ సర్జరీ ఎన్నోరెట్లు మెరుగ్గా ఉపయోగపడుతోంది. చిన్నపిల్లల చికిత్సా విభాగంలోకూడా రోబోటిక్ సర్జరీని ఉపయోగించటం క్రమక్రమేణా పెరుగుతోంది. ఈ విధానంలో కుట్లువేయటంలో పొరపాట్లు జరగటానికి అవకాశమేలేదు.
 
రోవింగ్ రోబో
 
డెట్రాయిట్ కేంద్రంగా పనిచేస్తున్న వట్టికూటి ఫౌండేషన్ భారతదేశంలో రోబోటిక్ సర్జరీని విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం ఇక్కడి వైద్యులు, సర్జన్ లు, ఆసుపత్రి నిర్వాహకులకు తెలిసే ఉంటుంది. అమెరికాకు చెందిన ఇంట్యూటివ్ సర్జికల్ ఇంక్లనేషన్ రూపొందించిన డావిన్సీ రోబోను వట్టికూటి టెక్నాలజీస్ పంపిణీ చేస్తోంది. వట్టికూటి ఫౌండేషన్, వట్టికూటి టెక్నాలజీస్, ఇంట్యూటివ్ సర్జికల్ ఇంక్లనేషన్ అనే మూడు సంస్థలూ కలిసి ‘రోవింగ్ రోబో’ అనే ప్రాజెక్టును ఏర్పాటు చేశాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా సర్జరీలు చేసే రోబోను, దేశంలో రోబోటిక్ సర్జరీలు చేయటంలో శిక్షణ పొందిన 275 మంది సర్జన్లలో ఒక వైద్యురాలిని దేశవ్యాప్తంగా పర్యటనకు తీసుకెళుతున్నారు. దేశవ్యాప్తంగా సర్జన్ లు, స్థానిక వైద్యులు, ఆసుపత్రుల నిర్వాహకులు సర్జికల్ రోబోను స్వయంగా తాకి, చూడటమే కాకుండా ఈ విధానంలో తన అనుభవాన్ని, రోగులకు కలిగే ఉపయోగాలను  రోబోటిక్ సర్జన్ మాటల ద్వారా తెలుసుకుంటారు.
 
గత ఆరేళ్ళలో ఫౌండేషన్ 20 భారతీయ నగరాలలోని 47 ఆసుపత్రులలో రోబోటిక్ సర్జరీ విధానాన్ని ప్రవేశపెట్టటమే కాకుండా ఎంతోమంది సర్జన్లకు శిక్షణ ఇవ్వటంద్వారా వారిని రోబోటిక్ సర్జన్లుగా మారుస్తోంది. వట్టికూటి ఫౌండేషన్ 1997లో అమెరికాలో రోబోటిక్ సర్జరీని ప్రోత్సహించటం ప్రారంభించింది. అప్పటినుంచి అమెరికా, యూరప్ మరియు భారతదేశాలలో దానికి ప్రచారం కల్పించటంలో కీలక పాత్ర పోషిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ లోని 4 కీలక నగరాలలో పర్యటన
 
దేశవ్యాప్త పర్యటనలో భాగంగా రోవింగ్ రోబో దక్షిణ దిశగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు నగరాలలో పర్యటించబోతోంది. డావిన్సీని విశాఖపట్నంలో(కేర్ హాస్పిటల్ ఆగస్ట్ 18; అపోలో హాస్పిటల్ హెల్త్ సిటీ, అరిలోవ ఆగస్ట్ 19; పినకిల్ హాస్పిటల్ హెల్త్ సిటీ, అరిలోవ ఆగస్ట్ 21-22), రాజమండ్రిలో(జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆగస్ట్ 26), విజయవాడలో(ప్రశాంత్ హాస్పిటల్ ఆగస్ట్ 28, ఆయుష్ హాస్పిటల్ ఆగస్ట్ 29 మరియు రమేష్ హాస్పిటల్ ఆగస్ట్ 30) తిరుపతిలో(స్విమ్స్ సెప్టెంబర్ 2-3) ప్రదర్శిస్తారు.
 
హైదరాబాద్ యశోద హాస్పిటల్ కు చెందిన ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ ఆగస్ట్ 23 నుంచి విశాఖపట్నంలో మొదలుపెట్టి పై నాలుగు నగరాలలో ఈ రోబోటిక్ సర్జరీలోని ముఖ్యాంశాలను, ఉపయోగాలను సర్జన్లకు వివరిస్తారు.
 
వట్టికూటి టెక్నాలజీస్ మరియు సర్జికల్ రోబో తయారీసంస్థ ఇంట్యూటివ్ సర్జికల్ ఇంక్లనేషన్ ఆసుపత్రులలో డావిన్సీ రోబోలను అమర్చటమే కాకుండా వచ్చే మూడేళ్ళలో వాటికి కావలసిన పరికరాలను కూడా ఒక ప్రత్యేకమైన ధరకు అందిస్తాయి.
 
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఈ సర్జికల్ రోబోలు హైదరాబాద్ లో మాత్రమే ఉన్నాయి… ఇవి అపోలో హాస్పిటల్, ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ, బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్, కృష్ణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(2 రోబోలు) మరియు యశోద హాస్పిటల్ లో పనిచేస్తున్నాయి.
 
వచ్చే ఐదేళ్ళలో 100 మంది సూపర్ స్పెషలిస్ట్ సర్జన్లకు ఫెలోషిప్ లు అందించటంద్వారా వారిని రోబోటిక్ సర్జన్లగా మార్చటంకూడా ఫౌండేషన్ లక్ష్యంలో ఒక భాగం. ఈ దిశలో కూడా మంచి పురోగతి ఏర్పడుతోంది. ప్రతి ఆరునెలలకూ ఒకసారి రోబోటిక్ సర్జన్ల సదస్సును ఒకదానిని వట్టికూటి ఫౌండేషన్ నిర్వహిస్తోంది. దీనిలో 100-125 మంది రోబోటిక్ సర్జన్లు పాల్గొని తమ అనుభవాలను, మెళుకువలను పంచుకుంటున్నారు.
 
భారతదేశ సర్జన్లు ఈ అత్యాధునిక సాంకేతిక పరికరాన్ని ఉపయోగించటంలో ఎంతో ఉత్సాహం, నైపుణ్యం కనబరుస్తున్నారు. ఫౌండేషన్ ఇటీవల నిర్వహించిన రోబోటిక్ సర్జన్ల సదస్సులో రోబోటిక్ సర్జన్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ అనుభవాలను, మెళుకువలను పరస్పరం పంచుకుని ఈ సర్జరీ విధానాన్ని ప్రోత్సహించటానికి సాయపడుతున్నారు.


Click here for Media Contact Details

Sanjiv Kataria, Strategic Communications and PR Counsel, +91-9810048095, Sanjiv.kataria@gmail.com


More News from Vattikuti Technologies

09/09/2017 2:43PM Image

Roving Surgical Bot: da Vinci Robot to Visit Trichy, Madurai

In an effort to familiarise surgeons and hospital administrators in Trichy and Madurai with computer-assisted surgeries, the da Vinci surgical robot will drive into these cities on September 11 for a live demo.

25/08/2017 10:30AM Image

Surgical Roving Robot to Tour Vijayawada, Tirupati

Now surgeons in Vijayawada and Tirupati in Andhra Pradesh can get to see how the da Vinci robot works when it arrives here as part of its country wide tour of India. Detroit-based Vattikuti Foundation which has been ...

18/08/2017 10:00AM Image

Roving Surgical Robot to Tour 4 Key Andhra Pradesh Cities

Cancer is a relentless disease. Damaging organs and tissues in its wake, cancer can be insidious in its onset, hiding malignant cells and tumours in the most unreachable parts of the body. Early detection is a daunting ...

Similar News

17/11/2017 7:30PM

Double Win for Vocalink at the 2017 Payments Awards

Vocalink, a Mastercard company, was last night awarded with two prestigious awards - The Overall Winner and the Payments Infrastructure of the Year Award, for its leading technology and expertise, and in ...

No Image

17/11/2017 6:45PM

21 सेमीफाइ‍नलिस्‍ट टीमें 1 मिलियन डॉलर अनु एवं नवीन जैन वीमेंस सेफ्‍टी एक्‍सप्राइज में पहुंची

एक्‍सप्राइज, मानवीयता की बड़ी चुनौतियों को हल करने के लिए इंसेंटिव प्रतियोगिताओं को तैयार करने में वैश्विक अग्रणी, ने आज घोषणा की है कि 21 टीमें 1 मिलियन डॉलर अनु एवं नवीन जैन वुमेंस सेफ्‍टी ...